మెగాస్టార్ చిరంజీవి సినిమాలో టాప్ సౌత్ హీరోయిన్ సిస్టర్ గా, యంగ్ హీరో కూడా నటిస్తున్నాడా !

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో టాప్ సౌత్ హీరోయిన్ సిస్టర్ గా, యంగ్ హీరో కూడా నటిస్తున్నాడా !

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఆచార్య సినిమా తర్వాత ఒక మలయాళ రీమేక్ సినిమాలో నటించబోతున్నారు మెగాస్టార్. చిరంజీవి మలయాళంలో మోహన్లాల్ నటించిన లూసిఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా మోహన్ రాజు దర్శకత్వంలో తెలుగులో రాబోతోంది. త్వరలోనే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోంది.
అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార ను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి నయనతార హీరోయిన్ గా కాకుండా చిరంజీవికి సోదరి గా నటించే పాత్రలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో నటించిన మంజు వారియర్ పాత్ర చాలా బలమైనది అందుకని తెలుగులో నయనతారను తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ పాత్ర చాలా ఎమోషన్స్ తో కూడుకున్నది కాబట్టి లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతారను తీసుకుంటారని టక్ అయితే చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ మోహన్ రాజా తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. మెగాస్టార్ 153 అప్డేట్ త్వరలోనే ఇస్తాను అంటూ చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాలో బ్లాఫ్ మాస్టర్ హీరో సత్యదేవ్ ఒక ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి.