నటుడు రాజా రవీంద్ర బాలకృష్ణ పై వ్యాఖ్యలు. ఆయనకు తెలిసిందంతే !

ప్రముఖ తెలుగు నటుడు రాజా రవీంద్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాజా రవీంద్ర సినిమాల్లో నటించడమే కాకుండా తెలుగు టాప్ హీరోలకు మేనేజర్ గా కూడా పని చేశాడు. అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చే వైఎస్ఆర్సిపి పార్టీ తరపున ప్రచారం కూడా చేశాడు. అయితే రాజారవీంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రాలో వైయస్ జగన్ రెడ్డి ని మించిన నాయకుడు లేడని సంక్షేమ పథకాలు అందరికీ అందినట్టు చేస్తాడని అన్నాడు.
అయితే నందమూరి బాలకృష్ణ వైసిపి పార్టీ ఆంధ్రాలో ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని త్వరలోనే పడిపోతుందని బాలకృష్ణ వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిపై స్పందించిన రాజారవీంద్ర బాలకృష్ణ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదని అన్నాడు. బాలకృష్ణ చాల ముక్కుసూటి మనిషి అని తనకు నచ్చకపోతే నచ్చలేదని ముఖం మీద చెప్తాడు. ఆయన మాటలకి అర్థం వేరే ఉంటుందని చెప్పాడు. బాలకృష్ణ చాలా చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏదైనా ఉంటే ముఖం మీదనే చెప్తాడు కోపం వస్తే తిట్టడం ఆప్యాయంగా కూర్చోబెట్టి మాట్లాడుతాడు బాలకృష్ణ. ఆయనకు కోపం రాదు ఒకవేళ వస్తే పక్కన ఉన్న వారిని కొట్టేస్తాడు. బాలయ్య పాట పాడాలి అనిపిస్తే పాడతాడు అది వినే వాళ్ళకి ఛాయిస్. వేరే వాళ్ల గురించి తప్పుగా మాట్లాడినా సరే నాకు అంతా తెలుసు నువ్వు నాకు ఏం చెప్పకు అని అంటారు అని బాలయ్య గురించి రాజారవీంద్ర చెప్పుకుంటూ వచ్చారు.