క్యాస్టింగ్ కౌచ్ వలన ఎదురైనా ఇబ్బందులు ..బడా సెలెబ్రిటీలు అనసూయ వివరణ

చాలామంది సెలబ్రిటీలు కాస్టింగ్ కౌచ్ పై వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. కొంతమంది డైరెక్టుగా సెలబ్రిటీల పేర్లు చెప్పారు కొంతమంది మేము కాస్టింగ్ కౌచ్ పై ఇబ్బంది పడ్డారు అని చెప్పారు. కానీ పేరు చెప్పలేదు కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమం నడిచింది. అయితే అనసూయ కూడా ఈ విషయంపై మాట్లాడారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలా పైకి రావాలన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది అని అనసూయ అన్నది.
చదువు పూర్తి చేసుకున్న తర్వాత అనసూయ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే ఆ తర్వాత వచ్చిన జబర్దస్త్ అవకాశం అనసూయకు సెలబ్రిటీ హోదా తెచ్చిపెట్టింది. అనసూయ మాట్లాడుతూ ఈ హోదా రావడానికి కేవలం నా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. అని ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. అయితే నేను వచ్చిన కొత్తలో నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదని అయినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పింది. అయితే ఈ అవకాశం కాకపోతే ఇంకొక వేరే మంచి అవకాశం వస్తుందని వేచి చూడవచ్చు అలా కాకుండా కొందరు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మనం ఒక పాత్రలో నటిస్తున్న అప్పుడు అంతకంటే బాగా నటించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పుడైనా సరే మీ లో ఉన్న టాలెంట్ మాత్రమే నమ్ముకోవాలి. సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా నేను కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని అవకాశాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది అయినప్పటికీ నేను ఎప్పుడూ నా కష్టాన్ని నమ్ముకున్నారు. ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ మాత్రమే నమ్ముకోవాలి ఇలా ఉంటే కాస్టింగ్ కౌచ్ ఏ కాదు ఏదీ మనల్ని ఏమీ చేయలేదు అని అనసూయ వివరణ ఇచ్చింది.