పవన్ తో పరిచయం ..మా మధ్య ఏమి జరిగిందో చెప్పిన ఆలీ

తెలుగు స్టార్ కమెడియన్ ఆలీ తన బాల్యం నుంచి సినిమాల్లో నటిస్తూ అంచలంచలుగా ఎదుగుతూ మంచి కమెడియన్గా స్థిరపడ్డాడు. ఆలీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి తన తో ఉన్న బంధం గురుంచి ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడిందో వివరించారు. పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లోకి రాక ముందు నేను చిరంజీవి గారి ఇంటికి అప్పుడప్పుడు వెళ్లేవాడిని అలా వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడే వాడు. కాఫీ తాగుతారా టీ తాగుతారా అని మర్యాదలు చేస్తూ ఉండేవాడు. అలా పరిచయం ఏర్పడింది పవన్ కళ్యాణ్ మొదటి సినిమా కాకుండా గోకులంలో సీత తో మా సినిమా ప్రయాణం మొదలైంది ఇలా స్టార్ట్ అయిన ప్రయాణం అజ్ఞాతవాసి ముందు సినిమా వరకు కొనసాగింది. చిరంజీవి కుటుంబానికి బ్రహ్మానందం గారు ఆలీ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ ని నన్ను చూస్తే చాలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. తనకి నేనన్నా నా కామెడీ ఆన్న చాలా ఇష్టం. మేము ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు సైగలు చేసుకుంటాం. మా మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు అని ఆలీ అన్నారు. పవన్ కళ్యాణ్ తన పొలంలో పండించిన మామిడి పండ్లను ప్రతి సంవత్సరం పంపిస్తాడు. కానీ ఈ సంవత్సరం పాలిటిక్స్ తో బిజీగా ఉండడం వల్ల పంపించలేదు అని అన్నాడు.