స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ. ..ఎదగడం అంటే ఇది

మాస్ మహారాజా రవితేజ తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. తనకంటూ ఒక మంచి మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. హీరోగా కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కి వెళ్ళాడు . తన అద్భుతమైన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన నటనతో టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగాడు. రవితేజ తో సినిమా అంటే మినిమం గ్యారెంటీ. అయితే రవితేజ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు పడ్డాడు. మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి కెరీర్ ని స్టార్ట్ చేశాడు.
ఎదగడం అంటే ఇలా ఎదగాలి అనే రేంజ్ లో టాలీవుడ్ లో పేరు సంపాదించుకున్నాడు మొదట్లో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాడు. పెద్ద హీరోల పక్కన సైడ్ క్యారెక్టర్లు కూడా చేశాడు. అంతే కాదు చాలా మంది స్టార్ హీరోల కి ఫ్రెండ్ గా కూడా యాక్ట్ చేశాడు. జగపతి బాబు శ్రీకాంత్, నాగార్జున ఇలా స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. మంచి హీరో అవకాశం కోసం సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎంతో ఓపికగా వచ్చిన అవకాశాన్ని దక్కించుకుంటూ మెల్లమెల్లగా ఎదిగాడు రవితేజ. ఎందరో స్టార్ హీరోల మధ్య నటించి ఇప్పుడు వాళ్ళ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. సింధూరం, నీకోసం వంటి సినిమాలతో సక్సెస్ సాధించాడు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎప్పటికైనా ఒక స్టార్ హీరోగా ఎదగాలన్న కసితో ప్రయత్నించాడు. తాను అనుకున్నట్టుగానే హీరోగా అవకాశాలు వచ్చి మంచి విజయాలను సాధించాడు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మానాన్న తమిళ అమ్మాయి ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. రవితేజ ఒక ఎనర్జిటిక్ స్టార్ మాత్రమే కాదు అంతకంటే గొప్ప నటుడు రవితేజ స్టార్ హీరో గా ఎదగడానికి చాలా సమయమే పట్టింది వచ్చిన అవకాశాల్ని దక్కించుకుంటూ ఎంతో ఓపికగా ఉంటూ స్టార్ హీరోగా విజయాన్ని సాధించాడు. రవితేజ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.