హీరో ల కంటే మేము ఎందులో తక్కువ అంటున్న తమన్నా
Thamanna Asking Shocking Questions for tollywood Heros

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ విషయంలో తగాదా వస్తూనే ఉంటుంది. కొందరు హీరోయిన్లు మేము హీరో తో పాటు సమానంగా కష్టపడుతున్నాం మాకు కూడా అంతే డబ్బులు ఇవ్వాలని అడుగుతూ ఉంటారు. అయితే ఇలాంటి విషయాలు బాలీవుడ్లో ఎక్కువగా జరుగుతాయి.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లో తమన్నా ఈ విషయంపై ప్రశ్నించింది. రవితేజ కొత్త సినిమా లో హీరోయిన్ రోల్ కోసం ఆ సినిమా నిర్మాతలు తమన్నాను సంప్రది సంప్రదించారు. అయితే తమన్నా భారీ రేంజ్ లో డిమాండ్ చేసిందని వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు మాత్రం ఆ హీరోయిన్ ని పక్కన పెట్టేశారు. అయితే తమన్నా ఈ విషయంపై స్పందిస్తూ ఒక హీరోకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు అంతే విధానంలో మాకు కూడా ఇవ్వాలని ఈ అసమానతలను తొలగించాలి అని అంది. డబ్బు విషయంలో హీరోలను ఎందుకు ప్రశ్నించరు నేను కూడా వాళ్ళ తో సమానంగా కష్టపడతాం. ఒక సినిమా హిట్ కావాలంటే అందులో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుంది. అయితే హీరోయిన్స్ కూడా ఎక్కువ వేతనం తీసుకుంటే తప్పేముంది అని అడిగింది. అయితే తనపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధాలే అని చెప్పింది. సినిమాకు సంబంధించిన విషయాలు అన్నీ ఫిబ్రవరిలోనే ఆపేసాను. ఒకవేళ రవితేజ తో నటించే అవకాశం వస్తే ఇంకో పది సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పింది.