సినీ నిర్మాతలకి అండగా మనసున్న హీరోలు

లాక్ డౌన్ కారణంగా బాగా నష్టపోయినా ఇండస్ట్రీ ఏదయినా ఉందంటే అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే. వాళ్ళు ఒక సినిమా తీయాలన్న ఒక సీరియల్ తీయాలన్న మొత్తం ఖర్చు పెట్టేది ఒక నిర్మాత. అయితే ఆ సినిమా కోసం నిర్మాత అప్పుచేసి మరీ సినిమా తీస్తాడు. కానీ లాక్ డౌన్ కారణంగా సినీ కార్మికులకు ఎలాంటి పని లేదు. సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఈ సమయంలో నిర్మాతలను ఎంతైనా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సినిమా చాలా బాగా వచ్చింది అంటే దాని వెనక నిర్మాత ఉంటాడు. ఏ కారణం గ నైనా సినిమా సరిగా ఆడక పోతే నష్టపోయేది నిర్మాత.

అయితే కొంతమంది హీరోలు నిర్మాతలు ఆదుకోవాలని చూస్తున్నారు. కోలీవుడ్లో ఇప్పటికే హీరో విజయ్ తన తన రెమ్యూనరేషన్ లో కొంత భాగం వెనక్కి ఇచ్చేసాడు. అయితే మరి కొంతమంది హీరోలు కూడా ముందుకు వస్తున్నారు . కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం వల్ల నిర్మాతలకు చాలా నష్టం వస్తుంది ఇలాగే మరికొంత మంది హీరోలు ఆదుకోవాలని అనుకుంటున్నారు. సినీ కార్మికుల్ని కూడా ఆదుకోవాలని కోరుకుందాం.