టాప్ హీరో కొడుకు మహేష్ బాబు కి వీరాభిమాని గా నటించబోతున్నాడు!

టాప్ హీరో కొడుకు మహేష్ బాబు కి వీరాభిమాని గా నటించబోతున్నాడు!

తెలుగులో టాప్ హీరోలకు అభిమానులుగా తెలుగు సినిమాల్లో కొందరు యువ హీరోలు నటిస్తున్నారు. అలాగే మహేష్బాబు కి కూడా కొంతమంది హీరో లు ఫ్యాన్ గా నటించారు.
అక్కినేని నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన నటుడు నాగ చైతన్య తన మొదటి సినిమా జోష్ నిరాశపరిచిన తర్వాత వచ్చిన ఏం మాయ చేసావే తో సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య మనం మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో థాంక్యూ అనే మూవీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాగచైతన్య కూడా మహేష్ బాబు కి థాంక్యూ అనే మూవీలో అభిమానిగా నటించబోతున్నాడు. మామూలు అభిమానిగా కాదు మొత్తం మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈ సినిమాలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఆబిడ్స్ లో షూటింగ్ దశలో ఉంది. నాగచైతన్య ఈ సినిమాలో అభిరామ్ అనే పాత్రలో మహేష్ బాబు అభిమాని గా నటించబోతున్నాడు మనం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ నాగచైతన్య ఓ సూపర్ హిట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మి, అవికాగోర్ ఇద్దరు హీరోయిన్లు గా నటిస్తున్నారు.