స్టార్ హీరో ఓకే అయినా వంశీ పైడిపల్లి మూవీ మాస్ మూవీ

మహేష్ బాబు తో మహర్షి వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన వంశీ పైడిపల్లి ఇంకా ఏ సినిమాకీ కమిట్ కాలేదు. తన సినిమా చేయబోయేది ఎవరితో అనేది చెప్పలేదు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లి తో సినిమా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా కుదరలేదు. మహేష్ బాబు పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. అయితే మహేష్ తో కుదరడం లేదని ఎన్టీఆర్ తో కానీ రామ్ చరణ్ తో కానీ సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే ఎట్టకేలకు రామ్ చరణ్ సినిమా ఒప్పుకున్నాడు. రామ్ చరణ్ వంశీ పైడిపల్లి తో నెక్స్ట్ సినిమా చేస్తాడట. వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ రామ్ చరణ్ కి బాగా నచ్చిందట రాజమౌళి సినిమా తర్వాత నెక్స్ట్ చేయబోయే సినిమా వంశీ పైడిపల్లి తోనే అని అంటున్నారు.