తెలుగు హీరో లకి ఎవరికీ దక్కని స్థానం విజయ్ దేవరకొండ కి దక్కింది ..టాప్ టెన్ లో ఎవరు లేరు

విజయ్ దేవరకొండ గీతగోవిందం, అర్జున్ రెడ్డి సినిమా లో టాప్ స్టార్ గా ఎదిగాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో యాక్టింగ్ ఆటిట్యూడ్తో యూత్ లో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. నోట, వరల్డ్ ఫేమస్ వంటి ఫ్లాపులు ఇచ్చినా కూడా తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. టైమ్స్ నౌ సంస్థ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా ఎవరు అనేది సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వే లో విజయ్ దేవరకొండ కు స్థానం దక్కింది.
ఈ సర్వేలో సినిమా హీరోలతో పాటు క్రికెటర్ల కు కూడా సర్వే నిర్వహించారు. అయితే 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నా సెలబ్రిటీలకు అవకాశం కల్పిస్తూ ఆన్లైన్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ ఇలాంటి హీరోలు కూడా ఉన్నారు. అంతేకాదు నవీన్ పోలి, దుల్కర్ సల్మాన్ క్రికెట్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలాంటి సెలబ్రిటీ లు ఉన్నారు. ఈ సర్వేలో షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. విజయ్ దేవరకొండ మూడు స్థానాల్లో ఉన్నాడు. అయితే మొదటి పది స్థానాల్లో మిగతా హీరోలు కూడా లేరు. విజయ్ దేవరకొండ కు తప్ప మొదటి పది స్థానాల్లో వేరే తెలుగు హీరో లేడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.