అసలు ఎవరి సాక్రిఫైస్ స్టార్ సునిషిత్ ..పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసారు

సాక్రిఫైస్ స్టార్ sunishith ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ ఇష్టమొచ్చినట్టు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు నచ్చినట్టు మాట్లాడుతూ ట్రెండింగ్ అవుతున్నాడు. సోషల్ మీడియాలో ఈ పేరు కూడా ఇదొక డిఫరెంట్ గా ఉంది. అయితే ఈ మహానుభావుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమన్నా తో ఫ్రెండ్షిప్ ఉందని లావణ్య త్రిపాఠి తో ఎఫైర్ ఉందని ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడాడు. సుకుమార్ సినిమాలో అవకాశం వచ్చిందని బన్నీ సినిమాలన్నీ నాకు ముందుగా వచ్చాయి అవకాశాలని వాళ్ళు కొట్టేశారు అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అంతేకాదు పోలీసులపై కూడా ఇష్టం వచ్చినట్టు వివాదాస్పద వాక్యాలు చేసాడు .
అందుకని పలువురు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈ sunishith ని అరెస్ట్ చేశారు. తమన్న తో నేను డేటింగ్ చేశాను అని తర్వాత అభిప్రాయ భేదాలు రావడం వల్ల విడిపోయాము అని చెప్పాడు. అంతేకాదు లావణ్య త్రిపాఠి పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. లావణ్య ప్రెగ్నెన్సీ వచ్చిందని వాగాడు ఆ తర్వాత గర్భం తిసయించేశామని చెప్పాడు . కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పోలీసులపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడు. అందువల్ల కీసర పోలీసులు ఈ sunishith అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
అయితే కీసర ఇన్స్పెక్టర్ నరేందర్ మాట్లాడుతూ ఈ సునీల్ అనే వ్యక్తి యాక్టర్ అని డైరెక్టర్ అని చాలా సినిమాల్లో నటించాలని నా సినిమా వేరే వాళ్ళు కొట్టేశారని అని చెప్పుకుంటున్నాడు. అంతేకాదు సిబిఐ ఇన్వెస్టిగేటర్ ఏసీబీ లో పని చేశానని సినీ తారల గురించి ఇష్టమొచ్చినట్లు వాగుతూ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఈ విషయం తెలిసిన కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ వారు ఇతన్ని ప్రోత్సహించారు. బాగా ట్రేండింగ్ అవుతున్నాయని సపోర్ట్ చేశారు. అయితే దీనిపై కూడా యూట్యూబ్ ఛానల్ వారికి నోటీసులు పంపిస్తామని చెప్పారు. ఆయన అరెస్టు కారణాలు ఇన్స్పెక్టర్ చెప్పారు. యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పోలీసుల పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు దీనిపై ఫిర్యాదు వచ్చింది అయితే అతని విచారిస్తే mtech చదువుకున్నాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా పని చేశాడట అయితే సినిమాలపై ఉన్న ఇంటరెస్ట్ తో పబ్లిసిటీ కోసం పలువురి యాక్టర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఫిర్యాదు రావడంతో అరెస్ట్ చేశామని చెప్పారు.