బాలకృష్ణ తో యుద్దానికి సిద్ధం అంటున్న టాప్ యంగ్ హీరో

వయసు మీద పడుతున్నా కెరీర్లో ముందుకు దూసుకుపోతున్న ఎనర్జిటిక్ గ ఉంటూ సినిమా లు చేస్తున్న నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా బాలకృష్ణ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. బాలకృష్ణ తనకు రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శీను తో మరొక సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాపై అంచనాలు గాసిప్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి.
బోయపాటి సినిమాలో బాలకృష్ణ అగోర గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ రాజశేఖర్ కూడా ముఖ్య పాత్ర చేస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర ను కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ నటించబోయే సినిమాలో నవీన్ విలన్ గా నటిస్తున్నాడు అని టాలీవుడ్ టాక్. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు ని గత సినిమాల కంటే ఇంకా పవర్ ఫుల్ గా చూపిస్తాడని టాక్. ఈ సినిమా కోసం బాలయ్య ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు.